సంక్రాతి స్పెషల్: తెలంగాణ ఫేమస్ సకినాలు తయారు చేసేయండి ఇలా…!

-

తెలుగు వారు జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ప్రధానమైనది. ఈ పండుగకి ఎంతో విశిష్టత ఉంది. పైగా ఇది ఒక రోజు రెండు రోజులు జరుపుకునేది కాదు. ఏకంగా ఈ పండుగని నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మరి ఇటువంటి అద్భుతమైన పండుగకి మీరు అన్ని సిద్ధం చేసేశారా…? అయితే ఈ పండుగకి ముందుగా సకినాలు వండేసి పక్కన ఉంచేసుకోండి. ఎలా చెయ్యాలో ఇప్పుడే చూసేయండి. పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభ కనుల పండువగా సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల రంగవల్లులూ, గొబ్బియలూ కనుల విందు చేస్తాయి.

ఈ పండుగ సమయంలో ఎన్నో రుచికరమైన వంటకాలను ఇళ్లలోనే చేసుకోవడం జరుగుతుంది. ఇంటిల్లిపాది కలిసి అనేక రకాల పిండి వంటలని వండుతారు. వాటిని చుట్టుపక్కల వారికి, బంధువులకు, స్నేహితులకు పంచుకుంటూ పండుగని జరుపుకుంటారు. ఇది నిన్నో మొన్నో వచ్చిన సంప్రదాయం కాదు. ఎప్పటి నుండో ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగకి ఎక్కువగా మురుకులు, అరిసెలు, బొబ్బట్లు, సకినాలు వంటి పిండి వంటలని చేస్తారు.

సకినాలు ఎలా తయారు చెయ్యాలి..?

కొత్త బియ్యం లేదా పాత బియ్యాన్ని నీళ్ళల్లో ఒక రాత్రి మొత్తం నానబెట్టాలి లేదా కనీసం 5 గంటలైనా కచ్చితంగా నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం పట్టించాలి. పిండిని కాస్త తడి ఆరే దాకా ఎండబెట్టాలి. ఒక కేజీ పిండికి కొలతల ప్రకారం 100 గ్రాముల నువ్వులు, వాము 10 గ్రాములు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంత కలపాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ గుడ్డలో దీనిని వేసుకుని దాని పైన ఈ పిండితో గుండ్రంగా చుట్టాలి. ఇలా సకినాల ఆకారం వచ్చే దాకా చుట్టాలి. ఇప్పుడు వీటిని మరిగించుకున్న ఆయిల్ లో వేసి గోల్డెన్ కలర్ వచ్చే దాక ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో సులువుగా వీటిని ఈ పండుగకి చేసేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version