కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్..!

-

విద్యుత్ శాఖలో కారుణ్య నియమాకాలకి బ్రేక్ వేస్తూ గత సర్కార్ తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయిన వాళ్ళ పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో మార్చి 4 , 2020లో జరిగిన 42వ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఏప్రిల్ 29 , 2020 విడుదల చేసిన ఉత్తర్వులు తాజా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

దీంతో కారుణ్య నియమకాలికి వెసులుబాటు లభించింది గత ప్రభుత్వంలో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని పరిగణలోకి తీసుకురావాలని దానికి అనుగుణంగా ఏకీకృత పాలసీని రూపొందించాలని విద్యుత్ శాఖ పరిధిలో అన్ని కార్పొరేట్ ఆఫీసులకి సీఎండీ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ ప్రొఫార్మాని రూపొందించాలని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news