మన దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం, తలసరి ఆదాయం లో మొట్ట మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ సమాచారాన్ని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో అగ్రగామిగా నిలుస్తున్నదని కేటీఆర్ వెల్లడించారు. ఈ నేపధ్యం లో కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కేంద్రం, తెలంగాణ రాష్ట్రానికి సహకరించకున్నా తెలంగాణ ఆర్థికంగా మొదటి స్థానం లో నిలుస్తున్నదని ట్విట్టర్‌లో ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 మాత్రమే ఉన్నప్పటికీ, సీఎం కేసీఆర్ పటిష్ట ఆర్థిక ప్రణాళికతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,17,000కు ఎదిగింది. తొమ్మిదేండ్లలోనే అత్యధికంగా 155 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేయూత ఇవ్వనప్పటికీ, ఆర్థికంగా అవస్థలు పెడుతున్నప్పటికీ తెలంగాణ మాత్రం ప్రగతిపథం వైపు దూసుకెళుతున్నది. అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. కేటీఆర్ ట్వీట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఇది తెలంగాణ సాధించిన ఘనత.. సీఎం కేసీఆర్ పనితీరుకు, నిబద్ధతకు నిదర్శనం… జయహో కేసీఆర్, జయహో బీఆర్‌ఎస్.. ఇలా అనేక మంది ట్విట్టర్‌లో తమ ఆనందాన్ని పంచుకున్నారు.