దీర్ఘాయుష్మాన్ భవ అంటూ… పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చిరు ట్వీట్ చేసారు. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అన్నారు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం అని కొనియాడారు.

ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ! అని పోస్ట్ పెట్టారు చిరంజీవి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్..వెండితెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్, జనహితమే అభిమతంగా రాజకీయాల్లో ప్రవేశించి పీపుల్ స్టార్‌గా ఎదిగారన్నారు. ప్రజల కోసం తగ్గుతారు.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గి తీరుతారు… సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి, అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు… pic.twitter.com/13gaXFpWsG— Chiranjeevi Konidela (@KChiruTweets) September 2, 2025