కేసీఆర్ మూవీ నుంచి తెలంగాణ తేజం సాంగ్ రిలీజ్

-

కొత్త దర్శకుడు అంజి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సినిమా పేరు కేసీఆర్ (కేశవ చంద్ర రామావత్). ఈ మూవీలో అనన్య కథానాయికగా న‌టిస్తోంది. గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ.. సైలెంట్ గా షూటింగ్ ని పూర్తి చేసుకొంటుంది.ఇదివరకే రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.

తాజాగా మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన తెలంగాణ తేజం అనే సాంగ్ ని విడుదల చేశారు.పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలగాణ ద్విపద దరువుల నేల… అంటూ సాగే ఈ పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.ప్రముఖ ప్రజాకవి, గాయకుడు గోరేటి వెంకన్న ఈ పాటకి సాహిత్యాన్ని అందించగా,చరణ్ అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. గోరేటి వెంకన్న, సింగర్ మనో , కల్పన ఈ పాటని పాడారు.ఈ మూవీని పల్లె మట్టివాసన తెలిసే చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలియజేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version