NTA JEE ఫలితాలు.. టాప్ లో తెలంగాణ..

-

మహమ్మారి రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో ఎన్నో జాగ్రత్తల నడుమ సెప్టెంబరు 6వ తేదీన జరిగిన జేఈఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కోసం జరిపిన ఈ పరిక్షల ఫలితాలు శుక్రవారం రిలీజ్ చేసారు. ఈ ఫలితాలలో 24మంది విద్యార్థులు వందశాతం మార్కులు సాధించారు. దేశం మొత్తం మీద 8లక్షల 58వేల మంది రిజిస్టర్ చేసుకోగా, 6లక్షల 35వేల మంది మాత్రమే హాజరయ్యారు. అంటే మొత్తం మీద 74శాతం మంది జేఈఈ పరీక్షకి హాజరయ్యారు.

ఐతే 24మంది వందశాతం స్కోరు సాధించిన వారిలో 8మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. దీంతో తెలంగాన టాప్ లో నిలిచింది. 5గురు విద్యార్థులతో ఢిల్లీ రెండవ స్థానంలో నిలవగా, రాజస్థాన్ 4మంది విద్యార్థులతో మూడవ స్థానంలో ఉంది. ఇంకా ముగ్గురు విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ 5వ స్థాన్ంలో నిలిచింది. గుజరాత్, మహారాష్ట్ర నుండి ఒక్కొక్కరు మాత్రమే వందశాతం మార్కులు సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news