లాక్ డౌన్ లో తెలంగాణా యువకుడు తన ఊరికి ఏం చేసాడో చూడండి…!

-

లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ౦. ఇది పక్కన పెడితే ఇప్పుడు లాక్ డౌన్ లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్ధం చేసుకుని కొందరు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఎవరికీ తోచిన సహాయ౦ వారు చేస్తున్నారు. తాజాగా ఒక యువకుడు తన ఊరి కోసం భారీ సాయం చేసాడు.

అంటే అతని స్తోమతకు అది భారీ సాయమే. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో రెక్కాడితే గానీ డొక్కాడనీ కుటుంబాలు విలవిలలాడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక యువకుడు శనివారం ఊరిలో ప్రతి కుటుంబానికి 10 కోడిగుడ్లతో పాటు ఒక కోడిని సైతం ఇచ్చాడు. పేద ప్రజలకు మాత్రమే అతను పంచిపెట్టాడు. గుంతపల్లికి చెందిన అనంతరెడ్డి… లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి కూడా సహాయం చేస్తూ వస్తున్నాడు.

నెల రోజుల్లో రెండు సార్లు అతను గ్రామంలో కూరగాయలు, నిత్యావసర సరుకులను అందించాడు. శనివార౦ కూడా 10 కోడి గుడ్లతో పాటు కోడిని ఇచ్చాడు. ఎందుకు ఈ సహాయం చేస్తున్నారని ప్రశ్నించగా… గ్రామానికి సరిహద్దుల్లో ఉన్న వికారాబాద్ జిల్లాలో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు బయటకు వెళ్లి ఏదీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని అందుకే అతను లాక్ డౌన్ లో ఈ సరుకులు అందిస్తున్నా అన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version