సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర బ్యాగ్ కలకలం

-

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర ఒక అనుమానిత బ్యాగ్ కలకలం రేపింది. ఆ బ్యాగ్ ను గుర్తించిన సెక్యూరిటీ వింగ్ అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు. దానిని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అనుమానాస్పద బ్యాగును అక్కడిని నుంచి తరలించి తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు బ్యాగు కలకలం తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల బందోబస్తు మరింత పటిష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం రేవంత్‌ ఇంటి చుట్టూ పరిసరాలు అన్నీ పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. సీఎం రేవంత్‌ రెడ్డి ఇంటి దగ్గర లభ్యమైన బ్యాగ్ లో ఏముందనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version