వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు – కేటీఆర్‌ సెటైర్లు

-

వేం నరేందర్ రెడ్డికి పదవి ఇప్పించు కోలేక పోయాడు అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. అసెంబ్లీ లో కేటీఆర్ చిట్ చాట్ లో పాల్గొని ఈ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీ లో వినట్లేదన్నారు. ఆయన అనుచరులకు పదవులు ఇప్పించు కోలేక పోతున్నారని చురకలు అంటించారు. ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థుల ను చూస్తే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు.

Chief Minister Revanth Reddy congratulated KTR

సొంత అనుచరుడు వేం నరేందర్ రెడ్డి కి కూడా పదవి ఇప్పించు కోలేక పోయాడని సెటైర్లు పేల్చారు. 39 సార్లు ఢిల్లీ కి పోయినా మంత్రి వర్గ విస్తరణ కూడా చేయలేక పోతున్నాడని మండిపడ్డారు కేటీఆర్‌. ఇక అటు ఇదే విషయంపై జగ్గారెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత నేను షాక్‌కు గురయ్యా.. మైండ్ బ్లాంక్ అయిందంటూ బాంబ్‌ పేల్చారు జగ్గారెడ్డి. మీడియాతో చిట్ చాట్‌లో జగ్గారెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడాలో చెప్పలేని షాక్‌లో ఉన్నానని తెలిపారు. నేనెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని మీడియాతో చిట్ చాట్‌లో వెల్లడించారు జగ్గారెడ్డి. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగానన్నారు. నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news