సీఎం కేసీఆర్‌పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ

-

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఓవైపు ముమ్మరంగా ప్రచారం సాగుతోంటే.. మరోవైపు ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టి కామారెడ్డి నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అధినేత సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం.

అయితే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తానని ప్రకటించినప్పుటి నుంచి కేసీఆర్​పై పోటీకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్​లు ఉవ్విళ్లూరుతున్నాయి. అక్కడి నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దింపి కేసీఆర్​ను ఓడించాలని అనుకుంటున్నాయి. ఇటీవలే రేవంత్ రెడ్డి.. హైకమాండ్ ఆదేశిస్తే కామారెడ్డి నుంచి తాను పోటీ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ప్రధాన పార్టీల నుంచే కేసీఆర్​కు పోటీ ఎదురవుతోంది అనుకుంటే.. ఇప్పుడు సామాన్య రైతుల నుంచి కూడా పోటీ ఎదురవుతోంది.

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీకి 100 నామినేషన్లు వేస్తామని పౌల్ట్రీ రైతులు తాజాగా వెల్లడించారు. ఇప్పటికే కాయితీ లంబాడీలు 1,016 నామినేషన్లు వేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా కామారెడ్డి రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో ఆసక్తికరంగా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news