తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ బీఆర్ఎస్ పార్టీకి ఊరట దక్కింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ఆటో, హ్యట్, ఇస్త్రీ పెట్టె, ట్రక్కు గుర్తులు ఉండవని కేంద్ర ఎన్నికలసంఘం ప్రకటించింది. ఇండిపెండెంట్ ల కోసం 193 గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చగా, వీటిని మినహాయించారు. కాగా, కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించొద్దని, దానివల్ల నష్టపోతున్నామని గతంలో బిఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఇది ఇలా ఉండగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్‌కు ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తీసుకున్నారు. ఇవాళ్టి తేదీతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీంతో కొత్త శాసనసభ ఏర్పాటుకు వీలుగా సభ్యులను ఎన్నుకునేందుకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు.