గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో జరిగిన కేబుల్ బ్రిడ్జి ప్రమాదంలో దాదాపు 140 మంది దుర్మరణం చెందినట్లు వార్తులు వస్తున్నాయి. మరి కొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన ఈ ఘటన రాజ్‌కోట్ ఎంపీ ఇంట్లో 12 మందిని బలి తీసుకుంది.ఈ ప్రమాదంలో రాజ్‌కోట్ బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందరియా కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.
వారంతా తన సోదరి కుటుంబానికి చెందినవారని కుందరియా తెలిపారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. అయితే.. బీజేపీ ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి చెందడంపై టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా తమ స్టైల్ మీమ్స్ క్రీయేట్ చేస్తున్నారు. బండి సంజయ్ కి కౌంటర్ వచ్చేలా పోస్టులు పెడుతున్నారు.
రెండు రోజుల కిందట ఎమ్మెల్యేల కొనుగోళ్లపై బండి సంజయ్ తడి బట్టలతో ప్రమాణం చేశారు. యాదాద్రిలో బండి సంజయ్ ఈ ప్రమాణం చేశారు. అయితే.. ఈ దెబ్బకే గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రజలతో పాటుగా బీజేపీ ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి చెందారని.. బండి సంజయ్ చేసిన పనికే.. ఇలా జరిగిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.