కేబుల్ బ్రిడ్జి విషాదం.. సీసీటీవి ఫుటేజీ చూశారా..!

-

గుజరాత్ మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. వంతెన కూలిపోవడం, అంతకుముందు జరిగిన పరిణామాలు అందులో రికార్డయ్యాయి. ప్రమాదానికి ముందు బ్రిడ్జిపై భారీ సంఖ్యలో సందర్శకులు కనిపిస్తున్నారు.

కొందరు ఆకతాయిలు వంతెన తీగలను పట్టుకొని అటూఇటూ ఊపారు. ఈ క్రమంలోనే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్నవారంతా నీటిలో పడిపోయారు. ఈ దుర్ఘటనలో 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు.

కేబుల్ బ్రిడ్జి ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముఖ్యంగా రాజ్‌కోట్ ఎంపీ ఏకంగా 12 మంది కుటుంబసభ్యులను కోల్పోయారు. రాజ్‌కోట్‌ ఎంపీ మోహన్‌భాయ్‌ కల్యాణ్‌జీ కుందారియా సోదరి కుటుంబసభ్యులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

మోర్బీ నగరంలో మచ్చు నదిపై ఉన్న బ్రిటిష్‌ పాలన కాలం నాటి ఓ తీగల వంతెన ఆదివారం సాయంత్రం కూలింది. దీపావళి సెలవులకు తోడు ఆదివారం కూడా కావడంతో ఈ వంతెన వద్ద పర్యాటకుల రద్దీ బాగా కనిపించింది. సందర్శకుల సంఖ్య మరీ ఎక్కువ కావడం వల్ల.. అధిక బరువును మోయలేక వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version