గోకుల్ చాట్ లుంబినీ పార్కు జంట పేలుళ్లకు నేటికి పదమూడేళ్లు పూర్తి అయ్యాయి. 2007 ఆగష్టు 25 న జరిగిన పేలుళ్లు జరిగాయి. ఈ జంట పేలుళ్లలో 42 మంది అమాయక ప్రజలు మృతి చెందడమే కాకుండా వంద మందికి పైగా క్షతగాత్రులయ్యారు అప్పుడు. పేలుళ్లకు పాల్పడిన నిందితులకు శిక్ష ఖరారు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు శిక్ష ఖరారు చేసింది.
ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరి లను దోషిగా తేల్చింది ఎన్ఐఏ కోర్ట్. పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాద సంస్థ పేరు ఇండియన్ ముజాహిదీన్. శిక్ష ఖరారు చేసిన ఇప్పటి వరకు తీర్పు అమలు కాలేదు. ఈ ఘటన అప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.