గుడ్ న్యూస్ .. త్వరలో మరో 1500 మంది టీచర్లకు పదోన్నతులు

-

తెలంగాణ ఉపాధ్యాయులకు గుడ్న్యూస్. ఇటీవల కొందరికి పదోన్నతులు కల్పించిన సర్కార్.. మిగిలిపోయిన ఖాళీలకు త్వరలో ప్రమోషన్లు కల్పించి భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాను రూపొందించి తమకు రెండు రోజుల్లో పంపాలని పాఠశాల విద్యాశాఖ  డీఈవోలను ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మందికి పదోన్నతులు లభిస్తాయని విద్యాశాఖ వర్గాలు అంచనా వేశాయి. కొందరు ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విద్యాశాఖ అధికారులు పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వాటిని కూడా భర్తీ చేస్తామని ఇటీవల హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిన సంగతి తెలిసిందే. తాజా సీనియారిటీ ఆధారంగా ఇలా ఖాళీగా ఉన్నవాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. పదోన్నతుల ప్రక్రియను ఆన్‌లైన్‌ విధానంలో కాకుండా మాన్యువల్‌గా చేసి ఉంటే ఈ ఖాళీల సమస్య ఏర్పడి ఉండేది కాదని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version