ఏపీలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. రషీద్ సంఘటన మరువక ముందే…ఏపీలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అగనంపూడి జంక్షన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సూర్య(25)ను ఓ దుండగుడు కత్తితో పలు సార్లు పొడిచాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మల్కాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన రావాలి డిమాండ్ చేశారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు, ఇతర వైసీపీ నాయకులు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని ఆగ్రహించారు.