ఐటీ కంపెనీల ఒత్తిడి వల్లే 14 గంటల వర్క్ ప్రతిపాదన : కర్ణాటక సర్కార్

-

కర్ణాటకలో ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు 14 గంటలు చేయాలనే ప్రతిపాదన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల వర్కింగ్ టైమ్ను పెంచాలని ఐటీ సంస్థలే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని ఆ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోశ్‌ లాడ్‌ తెలిపారు.  ఉద్యోగుల పని గంటలు పెంచాలని సిద్ధరామయ్య ప్రభుత్వం తీర్మానించడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా దీనిపై స్పందించిన కార్మిక శాఖ మంత్రి … ఉద్యోగుల పని వేళలను పెంచాలని నిర్ణయించింది ఐటీ మంత్రి కాదని స్వయంగా పరిశ్రమలేనని చెప్పారు. వారి ఒత్తిడి మేరకే ఈ బిల్లు తీర్మానం వరకు వచ్చిందని, దీనిపై చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని … దీనిపై పారిశ్రామికవేత్తలు బహిరంగ చర్చ జరపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా దీనిపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరిన సంతోశ్‌ అప్పుడే ఈ సమస్యకు సరైన పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగాల్లోని ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పని చేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్ఠంగా 14 గంటల చొప్పున పని చేయడానికి వీలు కల్పించేలా ప్రతిపాదిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version