కులవృత్తులకు అండగా తెలంగాణలో కొత్తగా 16 కార్పొరేషన్లు

-

తెలంగాణలో కులవృత్తులకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటి వరకూ కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం బలహీనవర్గాల ఆర్థిక బలోపేతం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గత శాసనసభ సమావేశాల్లో కులగణన సర్వేకి తీర్మానం చేశామని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

కులవృత్తులకు ఆర్థికంగా ఉపాధి కల్పించి బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కులవృత్తులకు సాంకేతికతను జోడించి మరింత ముందుకు తీసుకెళ్లాలని కేబినెట్లో నిర్ణయించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి.. రూ.వెయ్యి కోట్లు కేటాయించిందని, కానీ రూ.వెయ్యి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అలాకాకుండా తమ ప్రభుత్వం బలహీనవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ చేసి, వారిని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. గీత కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్న రేవంత్ వారికి సురక్షిత మోకులు ఇవ్వాలని మంత్రివర్గం ప్రతిపాదించినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version