BRS కార్పొరేటర్ దేదీప్య రావుకు ఊహించని షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో.. మరోసారి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై స్థానిక మహిళలు దాడికి దిగారు. ఎవరో కావాలనే ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సంఘటనలో స్వల్ప గాయాలతో కార్పొరేటర్ దేదీప్య రావు బయటపడ్డారు.అనంతరం జూబ్లీహిల్స్ పిఎస్ లో దేదీప్య రావు. తన భర్త విజయ ముదిరాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.