గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో భారీ వర్షాలు రెండు రోజుల నుంచి కురుస్తున్నాయి. ఈ తరుణంలోనే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లో 185 చెరువులు నిండిపోయాయి. ఇందులో పూర్తిగా నిండి అలుగు పోస్తున్నాయి 35 చెరువులు. చెరువులు తెగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ghmc సిబ్బంది, drf టీమ్ లను అలెర్ట్ చేసిన అధికారులు.. ప్రజలకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు.
కాగా భారీ వర్షాలు కురవడం వల్ల పొంగి పొర్లిన వరదల వల్ల నిరాశ్రయులైన వారికి తక్షణమే నిత్యవసర సరుకులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇప్పటికే పునరావస కేంద్రాలకు తరలించిన ప్రజలకు భోజన వసతితో పాటు వారికి మెరుగైన వైద్య సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందించిందన్నారు.
వరదలు తగ్గిన తర్వాత నష్టం అంచనా వేయించి ప్రభుత్వం బాధితులను ఆదుకుంటుందని చెప్పారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఖమ్మంలో మున్నేరు ఉప్పొంగడంతో కొంతమేర నష్టం జరిగిందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.