ఉస్మానియాలో అందని సరైన వైద్యం.. రోగుల అవస్థలు!

-

రాష్ట్రంలో ఓవైపు భారీ వర్షాలు కురుస్తుండగా మరోవైపు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల వద్ద క్యూ కడుతున్నారు.రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆస్ప్రతుల వద్ద గంటల సేపు పడిగాపులు కాయాల్సి వస్తుంది. దీంతో ఓపీ బ్లాకులు కిటకిటలాడుతున్నాయి. అందుబాటులో సరైన వైద్యులు లేకపోవడంతోనే ఆస్పత్రుల వద్ద వైద్య సేవలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఉస్మానియా ఆస్పత్రిలో వివిధ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసియేట్లు, డైటీషియన్, ఆర్ఎంవోలు ఇటీవల రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రులకు బదిలీ అయ్యారు.

దీంతో సరైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. వారి స్థానంలో కొంత మందిని ఇక్కడకు బదిలీ అయినా ఆస్పత్రిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని తెలుస్తోంది.మరికొన్ని ఘటనల్లో ఆస్పత్రిలో సరిపడా బెడ్లు లేకపోవడంతో రోగులు నేలమీదే కాలం వెల్లదీయాల్సి వస్తోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినా సరైన సమాధానం రావడం లేదని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రోగులు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news