ఖైరతాబాద్ మహా గణపతి వద్ద భక్త జనం కిక్కిరిసిపోయారు. చివరి రోజు దర్శనం కోసం ఎగబడుతున్నారు భక్తులు. గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఈరోజు ఆదివారం కావడంతో మరింతగా రద్దీ పెరిగే అవకాశం ఉంది. చిన్న పిల్లలు కుటుంబ సభ్యులతో వస్తున్న భక్తులతో కిటకిటలాడుతుంది ఖైరతాబాద్. ఇప్పటికే పెరిగిన రద్దీతో చేతులెత్తేసారు అధికారులు. చంటి పిల్లలతో గణపతి దర్శనం కోసం వచ్చారు తల్లి తండ్రులు.
అయితే రద్దీ ఎక్కువ కావడంతో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చిన్నపిల్లలు, మహిళలు. ఇసుక పోస్తే రాలనంత జన సంద్రోహంగా ఖైరతాబాద్ మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖైరతాబాద్ గణపతి కి భక్తుల తాకిడి వస్తుంది. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా భక్తులు మహా గణపతిని దర్శించుకున్నారు. ఇంకా కూడా ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం కోసం రద్దీగా కొనసాగుతుంది. రాత్రి వరకు ఈ రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి.