జైలు నుంచి విడుదలైన 213 మంది ఖైదీలు

-

క్షణికావేశంలో చేసిన తప్పు.. తీసిన ప్రాణం.. ఎదుటివారి జీవితాన్నే కాకుండా వారి జీవితాన్ని చీకటిపాలు చేసింది. వాళ్లను నమ్ముకున్న వారిని అంధకారంలోకి నెట్టేసింది. ఏళ్ల పాటు కుటుంబానికి దూరంగా జైళ్లలో మగ్గుతున్న వారికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ప్రభుత్వం క్షమాభిక్షతో ఎన్నో ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న 213 మంది ఖైదీలు బుధవారం విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వేళ అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది.

మరోవైపు వారంతా కొత్త జీవితం ప్రారంభించేలా జైళ్ల శాఖ అండగా నిలబడింది. ఖైదీల్లో 33 శాతం మందికి పెట్రోల్ బంకుల్లో ఉపాధి కల్పించింది. మరికొందరికి కార్పెంటర్లు, వెల్డర్‌లుగా ఉద్యోగాలు ఇచ్చింది. 10 మంది మహిళలకు కుట్టుమిషన్‌లు అందించారు. విడుదలైన ఖైదీల్లో మిగతా వారికి కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత తమదేనని జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా హామీ ఇచ్చారు.

మరోవైపు జైలు నుంచి తమవారు విడుదల కావడంతో కుటుంబసభ్యులకు ఎమోషనల్ అయ్యారు. చర్లపల్లి జైలు ప్రాంగణం ఈ ఉద్విగ్న క్షణాలకు వేదికైంది. క్షణికావేశంలో చేసిన నేరానికి… కుటుంబాలకు దూరమై నరకం చూశామని విడులైన ఖైదీలు ఆవేదన వ్యక్తం చేశారు.. జైలులో నేర్చుకున్న నైపుణ్యాలతో ఇకపై జీవితాన్ని గడుపుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version