వరంగల్ లో 33 వేల ఉద్యోగాలు రాబోతున్నాయి – మంత్రి కేటీఆర్

-

వరంగల్లులో 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఇవాళ . బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్ చేరుకున్న కేటీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకున్నారు. ఈ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కొత్త కంపెనీలకు శంకుస్థాపన చేసిన ఆయన…. వచ్చే మూడు, నాలుగు నెలలు ఎవరైనా చిల్లరమల్లర మాటలు మాట్లాడితే ఊరుకోవద్దని… దీటుగా బదులు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. వరంగల్ జిల్లాకు రానున్న 3 కంపెనీల వల్ల 33 వేల ఉద్యోగాలు వస్తాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version