తెలంగాణ‌లో నేడు కొత్త‌గా 36 క‌రోనా కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు గ‌త కొద్ది రోజుల నుంచి నిల‌క‌డ‌గా ఉంటున్నాయి. ప్ర‌తి రోజు రాష్ట్రంలో 50 లోపే క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. తాజా గా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా వైర‌స్ బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 36 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,110కి చేరింది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఎలాంటి మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. గ‌డిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 536 మంది క‌రోనా వైరస్ సోకి ఉన్నారు. కాగ రాష్ట్రంలో నేడు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 20,427 క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. కాగ ఇంకా.. 293 ప‌రీక్షల ఫ‌లితాలు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version