తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. తాజాగా మరికొన్ని డయాగ్నస్టిక్ సెంటర్ల మంజూరు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లోని నాలుగు ఐటీడీఏ పరిధిలో గల ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లను మంజూరు చేసింది కాంగ్రెస్ సర్కార్.
నిర్ణీత తేదీల్లో ఉన్నతాధికారుల పర్యటన అనంతరం ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సెంటర్లు ఏర్పాటైతే ఏజెన్సీ ప్రాంత ప్రజల రక్త నమూనాలను జిల్లా కేంద్రాలకు పంపించకుండానే వ్యాధి నిర్ధారణ సులువు కానుంది.