బీసీలకు 50 శాతం ఓట్లు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

-

బీజేపీలో ముఖ్యమంత్రిలో ముందుగానే ప్రకటించే సంస్కృతి లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సంచల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్నారు. బీసీని సీఎంని చేస్తామని ప్రకటించామన్నారు. బీసీ, ఎస్సీ, అగ్ర వర్ణాల పేదలు బీజేపీ మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. ఈనెల 07న బీసీ ఆత్మీయ గౌరవ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ హాజరు అవుతారని తెలిపారు. స్వచ్ఛందంగా అందరూ తరలిరావాలన్నారు.

ప్రధాని మోడీ అయిన తరువాత బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 27 మంది బీసీలను మంత్రులను చేసిన ఘటన బీజేపీది అన్నారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. 23 సీట్లు మాత్రమే బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిందన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ అవమాన పరిచింది అని తెలిపారు. రేపు కరీంనగర్ బీజేపీ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. బీసీ నినాదం బీఆర్ఎస్ ఎందుకు పక్కకు పెట్టారని తెలిపారు. బీసీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version