బడ్జెట్ లో రూ. 60 వేల కోట్లు ఆరు గ్యారంటీలకే !

-

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెడతారు. ఇప్పటికే బడ్జెట్ దాదాపుగా సిద్ధమైంది. రాష్ట్ర ఆదాయ, వ్యయాలపై వాస్తవిక అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆరు హామీలకు కలిపి రూ.60 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళ బ్యాంకు ఖాతాలో నెలకు రూ.2500 జమ చేయడానికే రూ.15 వేల కోట్లకు పైగా అవసరమని భావిస్తున్నారు. ఈ పథకానికి 92.33 లక్షల మంది మహిళలు దరఖాస్తులివ్వగా.. అర్హుల సంఖ్య తేలాక ఎన్ని నిధులు ఖర్చుపెట్టాలనేది తెలుస్తుంది. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్లు, రైతు భరోసా వంటి పథకాలన్నింటికీ ఏటా రూ.వేల కోట్లు అవసరమని అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news