తెలంగాణ లో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలో ఫెయిలైనందుకు మరో ముగ్గురు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణం గోదావరి రోడ్డుకు చెందిన పందిరి అశ్విత (17) ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

కామారెడ్డి జిల్లా భిక్కనూరు గ్రామాని కి చెందిన పూజ (17) ఇంట్లో ఎవరు లేని సమయంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. భూపాలపల్లి జిల్లా పలిమెల మండల కేంద్రంలోని అప్పాజీ పేటకు చెందిన జాడి సంజన (16) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అటు నిన్న ఇంటర్ పరీక్షల్లో ఫెయిలై ఐదుగురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు.
మొదటగా ఎల్బీనగర్ – నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న అరుంధతి ఇంటర్ ఫెయిల్ అయిందని మనస్థాప్తంతో తట్టి అన్నారంలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.