సీఎం కేసీఆర్ పై 81 మంది పోటీ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ నామినేషన్ ఉపసంహరణ అనంతరం గజ్వేల్ అసెంబ్లీ నియోజక వర్గంలో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత రెండు రోజులుగా 70 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా.. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీలో ఉన్నారు. అటు కామారెడ్డిలో కూడా 19 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నారు.

తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఓవరాల్ గా జీహెచ్ఎంసీ పరిధిలో 15 స్థానాలకు 312 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. నాంపల్లిలో అత్యధికంగా 34 మంది ముషీరాబాద్ లో 31 మంది.. మలక్ పేట యాకత్ పురాలో 27 మంది క్యాండిడేట్స్ పోటీ పడుతున్నారు. చాలా రసవత్తరంగా జరిగే ఈ ఎన్నికల్లో అధికారంలోకి ఏ పార్టీ గెలుస్తుందనేది వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news