ఒకేసారి 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం: కేసీఆర్‌

-

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తొమ్మిది వైద్య కళాశాలలను ఒకేసారి ప్రారంభించారు. వర్చువల్ వేదికగా ఈ కళాశాలలకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 9 వైద్య కాలేజీలు ప్రారంభించడం శుభపరిణామం అని కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని.. రాబోయే సంవత్సరంలో మరో 8 వైద్య కళాశాలలు ప్రారంభిస్తామని తెలిపారు. మారుమూల జిల్లాల్లో సైతం వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

‘తెలంగాణ ఏటా 10 వేల మంది వైద్యులను దేశానికి అందించబోతుంది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయి. పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నాం. గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు ప్రారంభించాం. మాతా, శిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయి.’ అని కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news