అమీర్ పేట్ లో కలకలం నెలకొంది. అమీర్ పేట్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి టూవీలర్ ను ఢీకొట్టింది స్కోడా కారు. అమీర్ పేట్ నుంచి SR నగర్ వెళ్లే రోడ్డుపై ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి……దింతో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆసుపత్రికి తరలించారు.
ఢీకొట్టిన తర్వాత ఆపకుండా వెళ్తున్న యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. మద్యం సేవించి కారు నడుపుతున్న యువకులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక అమీర్ పేట్ లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అమీర్ పేట్ లో అర్ధరాత్రి కారు బీభత్సం
అతివేగంగా దూసుకొచ్చి టూవీలర్ ను ఢీకొట్టిన స్కోడా కారు
అమీర్ పేట్ నుంచి SR నగర్ వెళ్లే రోడ్డుపై ప్రమాదం
బైక్ పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలు……ఆసుపత్రికి తరలింపు
ఢీకొట్టిన తర్వాత ఆపకుండా వెళ్తున్న యువకులను పట్టుకొని పోలీసులకు… pic.twitter.com/xh3q0sUaBl
— BIG TV Breaking News (@bigtvtelugu) March 29, 2025