తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు. విపరీతంగా ఎండలు కొడుతున్న నేపథ్యంలో… తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయేషు వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. ఏప్రిల్ మాసంలో రెండవ తేదీ నుంచి నాలుగో తేదీ వరకు… అంటే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని… హైదరాబాద్ మహానగర వాతావరణ శాఖ కేంద్రం వెల్లడించడం జరిగింది.

ఇక నేటి నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా అంచనా వేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల నుంచి 41 డిగ్రీల మధ్య ఉంటున్నాయి.