ప్రతి ఒక్కరి జీవితంలో ప్రశాంతత ఎంతో అవసరం. ఎప్పుడైతే ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందో ఇంట్లో పాజిటివిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు తలెత్తవు. కనుక మీ ఇంట్లో పాజిటివిటీ పెరగాలంటే తప్పకుండా వీటిని పాటించండి. ప్రతి రోజు ఎంతో ఆనందంగా జీవించాలంటే మీ పూజ గదిలో వీటిని అస్సలు ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను పూజ గదిలో ఉంచడం వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి అని వాస్తు నిపుణులు చెప్తున్నారు.
చాలా శాతం మంది గంగా జలంను ఇంట్లో ఉంచడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని భావిస్తారు. కానీ ఇనుము లేక ప్లాస్టిక్ వంటి వాటిలో ఉంచడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక గంగాజలం ను ప్లాస్టిక్ లేక ఇనుము వాటిలో ఉంచవద్దు. సహజంగా ఇంట్లో ఎన్నో రకాల దేవుడి విగ్రహాలు ఉంటాయి. ఎప్పుడైతే పూజ గదిలో మూడు, ఐదు వంటి బేసి సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు పెట్టడం వలన అస్సలు మంచిది కాదు. కేవలం ఒకటి లేక రెండు విగ్రహాలను ఇంట్లో ఉంచవచ్చు. ఎక్కువ విగ్రహాలను పెట్టడం వలన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అదేవిధంగా విరిగిపోయిన లేక పాడైపోయిన విగ్రహాలను కూడా పూజ గదిలో ఉంచకూడదు.
ఎప్పుడైతే విరిగిపోయిన పాత విగ్రహాలను పూజ గదిలో ఉంచుతారో అప్పుడు ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువ అవుతుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొంతమంది పూజ గదిలో దేవుడి విగ్రహాలతో పాటుగా చనిపోయిన పూర్వీకుల ఫోటోలను కూడా పెడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక పూజ గదిలో కేవలం దేవుడి ఫోటోలను మాత్రమే పెట్టాలి. కనుక ఇటువంటివి పాటించడం ఎంతో అవసరం కనుక ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయకండి.