Kova Laxmi: కొత్త చట్టాల ప్రకారం మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై కేసు

-

Asifabad MLA Kova Lakshmi: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఊహించని షాక్‌ తగిలింది. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కేసు నమోదు అయింది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావును అసభ్య పదజాలంతో దూషించడంతో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా నాయకుడు విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

A case has been registered against Asifabad MLA Kova Lakshmi in Asifabad Police Station

సెక్షన్ 296(B),351(2)BNS ప్రకారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసు నమోదు చేశారు ఎస్సై ప్రవీణ్ కుమార్. ఇక అటు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version