రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన సోషల్ మీడియా కు సంబంధించిన యువకుడిపై కేసు నమోదు అయింది. ఈ సంఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇంకేముంది…ఈ వైరల్ వీడియో ఘట్‌కేసర్ పోలీసులకు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ఇక దీనిపై పోలీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది.
రోడ్డుపై డబ్బుల కట్టలు విసిరేసిన యువకుడిపై కేసు నమోదు
హైదరాబాద్ – ఘట్‌కేసర్ పరిధిలోని ఆర్ఆర్ఆర్ వద్ద ఓ యువకుడు రూ.20 వేలు రోడ్డు పక్కన విసిరేసి, వీడియో చూసినవారు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
వీడియో వైరల్‌గా మారి ఘట్‌కేసర్ పోలీసులకు చేరడంతో,… pic.twitter.com/381xbu54bd
— Telugu Scribe (@TeluguScribe) December 18, 2024