ఒక్క ఎకరానికి రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి… కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రైతులను కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతుంది.. రేవంత్ సర్కార్‌ది అన్ని రంగాల్లో మెగా మోసం, వంచన అంటూ ఆగ్రహించారు.
రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి… ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని… వడగండ్లవాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదని తెలిపారు. గత ఏడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్, వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించాం… డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రకారం రూ. 2,000-2,500 అంచనా వేసినా కూడా రైతుకన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించాం.. ఒకే రోజు రూ. 1,300 కోట్లు విడుదల చేశాం.. తర్వాత మిగతా వాటికి అందించామని గుర్తు చేశారు. అప్పుడు ఎకరాకు రూ.10 వేలు బిచ్చం వేస్తున్నారా ? అని ఇదే రేవంత్, కాంగ్రెస్ నేతలు అన్నారని ఫైర్ అయ్యారు.