భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే రైతు బంధు ఇస్తామని ప్రకటించారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. ఆ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవన్నారు. ఇక్కడి భూ చట్టాలు వేరు, ఏపీలో ఉన్న చట్టాలు వేరని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 20 లక్షల రైతులకే రుణమాఫీ చేశారని తెలిపారు. ఇప్పుడు 42 లక్షల మంది రైతులున్నారన్నారు. రైతు క్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుంది….5 ఏళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేయలేదని ఆగ్రహించారు.
ఒకేసారి 18 వేల కోట్ల రూపాయలు ఇచ్చి రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదని…ఇంకా అవసరమైన నిధులు సమకూరుస్తామని ప్రకటించారు. పంట నష్టంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రీమియం ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ చేయనుందని పేర్కొన్నారు. ప్రతిపంట, ప్రతిరైతు కు భీమా వర్తించేలా 3000 కోట్లతో ఇన్సూరెన్స్ అన్నారు.