హైదరాబాద్‌ లో మరో అరాచకం..డ్రగ్ ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్ !

-

హైదరాబాద్‌ మరో ముఠా కుట్ర బయటపడింది. ఆన్‌లైన్‌ వేదికగా డ్రగ్ ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్ అయింది. మత్తు, స్టెరాయిడ్‌ ఇంజక్షన్ల విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ముఠా నుంచి ఇంజక్షన్లు కొని స్థానికంగా అమ్ముతున్న మరో ఏడుగురు అరెస్ట్‌ అయ్యారు. హాజీపూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా మత్తు ఇంజక్షన్ల సరఫరా జరుగుతోంది. మత్తు ఇంజక్షన్లకు డిమాండ్ పెరగడంతో సొంతంగా ఫ్యాక్టరీని పెట్టిన ముఠా… మత్తు ఇంజెక్షన్ , స్టెరాయిడ్‌ డిమాండు ఉండడంతో ఫ్యాక్టరీలో ఇంజక్షన్లను తయారీ చేస్తోంది.

A gang selling drug injections arrested

సరస్వతి ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట ఫార్మాస్యూటికల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పేరుతో సరఫరా చేస్తున్నారట. హజీపూర్‌లోని మా సుశీల దేవి హాస్పిటల్‌లో పనిచేస్తున్న కెమిస్ట్‌తో కలిసి ఇంజక్షన్ల తయారీ చేస్తున్నారు. వెబ్‌సైట్‌ ద్వారానే మత్తు, స్టెరాయిడ్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. ఆసుపత్రిలోని అడ్డాగా మార్చుకొని కొరియర్‌ ద్వారా వాటిని దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల ద్వారా మత్తు ఇంజక్షన్ల విక్రయాలు జరుగుతున్నాయి. పంజాగుట్టకు చెందిన నయీముద్దీన్‌ పట్నాలోని విజయ్‌కుమార్‌ గుప్తాను ద్వారా విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఈ ముఠా దేశవ్యాప్తంగా 88 లక్షలు లక్షల ఇంజక్షన్లు సరఫరా జరిగాయి. హైదరాబాద్‌లోనే 1,000 వరకూ విక్రయించినట్టు గుర్తించారు. ప్రధాన నిందితుడు విజయ్‌కుమార్‌గుప్తా, నగరానికి చెందిన విక్రయదారుడు నయీముద్దీన్ అరెస్టు అయ్యాడు. ఇంజక్షన్లు కొనుగోలు చేసిన మహేశ్, లవణ్‌కుమార్‌ యాదవ్, సురేష్‌ సాయికిరణ్, మనీష్‌ యాదవ్, నిఖిల్‌ యాదవ్‌లను అరెస్ట్‌ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news