పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం

-

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ అంటే ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ కి ఓల్డ్ సిటీ అడ్డాగా మారింది. కత్తులతో హడలెత్తించడం, గ్యాంగ్ వార్ లు జరగడం ఇక్కడ సర్వసాధారణం. కొందరు పీకల్లోతు మద్యం సేవించి గొడవలకు దిగితే.. మరికొందరు కక్ష సాధింపు చర్యలతో కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతుంటారు. కానీ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కాస్తంత ప్రశాంతంగా ఉంటుంది.

కానీ ఈ పాత బస్తీలో ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఏ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. గత రాత్రి పాతబస్తీలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. రెండు గ్రూపులకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు సెటిల్మెంట్ విషయంలో రెండు గ్రూపులు అర్థరాత్రి ఓ హోటల్లో సమావేశం అయ్యాయి. ఈ క్రమంలో మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news