హఫీజ్ పేటలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు..!

-

హైదరాబాద్ హఫీజ్ పేటలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ ఎస్వోటీ పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్య భర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా.. ఏకంగా రూ.40లక్షలు విలువైన బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు.

బెట్టింగ్ ముఠాను పట్టుకునే క్రమంలో నిందితుల నుంచి రూ.55వేలు నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.22లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మొత్తం 7 అకౌంటర్లను గుర్తించారు. అజయ్ గతంలోనే నాలుగు సార్లు క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడ్డాడు. అయినప్పటి మరోసారి బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులు దొరికిపోయాడు. పోలీసులు ఈ బెట్టింగ్ ముఠాతో సంబంధం ఉన్న ముగ్గురు ఫంటర్లను అదుపులోకి తీసుకొని.. వారిని మియాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో హైదరాబాద్ లో ఆన్ లైన్ బెట్టింగ్ మాఫియా భారీగా విస్తరించిందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news