ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రుల నిర్లక్ష్యం ఖరీదు రూ. 100 కోట్ల నష్టం వాటిల్లునట్లు చెబుతున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్ద వాగు ప్రాజెక్ట్ గేట్ల వద్ద భారీ గండి పడింది. దీంతో పెదవాగు ప్రాజెక్టు ఖాళీ అయింది. ఈ తరుణంలోనే.. గ్రామాల్లోకి ముంచెత్తింది వరద నీరు.
ఇక రాత్రి కట్టకు పడిన గండి అర్థరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది.. దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి 70 ఇళ్లలోకి నీరు వెళ్లింది. కూలిన 15 ఇళ్లు కాగా.. 200పైగా పశువుల మృత్యువాత పట్టాయి. పూర్తిస్థాయి మరమ్మతులకు రూ.100 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.