గచ్చిబౌలిలో దారుణం.. గర్భిణిపై దాడి చేసిన భర్త..!

-

గర్భిణిపై దాడి చేసాడు ఓ భర్త..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 2024 అక్టోబర్ లో బెంగాల్ కు చెందిన షబానా పర్వీన్ తో మహమ్మద్ బస్ రత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. హఫీజ్ పేట్ ఆదిత్యనగర్ లో నివాసముంటూ ఇంటీరియర్ పనులు చేస్తున్నాడు మహమ్మద్ బస్ రత్.

A husband attack a pregnant woman

రెండు నెలల గర్భంతో గత నెల 29న ఆసుపత్రిలో చేరారు పర్వీన్. డిశ్చార్చ్ అయిన తర్వాత ఆసుపత్రి ముందు భార్యా, భర్తల మధ్య గొడవ పడ్డారు. భార్య పర్వీన్ ను రోడ్డుపై పడేసి బండరాయితో దాడి చేసాడు భర్త మహమ్మద్ బస్ రత్. ప్రస్తుతం పర్వీన్ కోమాలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. ఈ దారుణ సంఘటన పై ఇంకా వివరాలు తెలి యాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news