ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టివేత..!

-

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితులైన నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీతావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ మేరకు నిందితులకు బెయిల్ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కాగా ఈ కేసులో సమగ్ర సాక్షాలను పోలీసు ఉన్నతాధికారులు మొత్తం మూడు బాక్సుల్లో కోర్టుకు సమర్పించారు. ఇందులో హార్డ్ డిస్క్లు, సీడీ, పెన్ డ్రైవ్లు ఉన్నాయి.

ఈ క్రమంలో తాము 90 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ని పూర్తి చేసుకున్నామని, దర్యాప్తు అధికారులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో తమకు బెయిల్ ఇవ్వాలని కోర్టుకు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ విజ్ఞప్తి చేశారు. అయితే.. సరైన దారిలో విచారణ కొనసాగుతోందని, ఇలాం టైంలో నిందితులకు బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ నిందితులు బయటకు వస్తే దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందంటూ తన వాదనలు వినిపించారు. ఆయన వాదనను ఏకీభవించిన నాంపల్లి కోర్టు నిందితుల బెయిల్ పిటషన్లను కొట్టివేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news