హైదరాబాద్ నగరంలోని హుమాయున్‌నగర్‌లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఫుడ్ డెలివరీ ఆర్డర్ లేట్ అయిందని, డెలివరీ బాయ్‌పై విచక్షణరహితంగా దాడికి దిగాడు. తన 15 మంది అనుచరులతో కలిసి వచ్చి ఓ హోటల్ వద్ద భయానక వాతవరణం సృష్టించాడు.
భయంతో సదరు ఫుడ్ డెలివరీ బాయ్ హోటల్‌లోకి పరుగులు తీయగా, వెంబడించిన వారు హోటల్‌లోకి దూసుకెళ్లి మరీ బాధితుడిపై దాడి చేశారు. ఈ క్రమంలో మరిగే నూనె మీద పడడంతో ఫుడ్ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.