మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు ఫోన్ టాపింగ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు , బెదిరింపులకు పాల్పడ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, ఏ2గా రాధాకృష్ణన్ రావు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా హరీష్ రావు పీఏ వంశీకృష్ణతో పాటు సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు.

చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు ముగ్గురు నిందితులు పాల్పడ్డారట. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్ లు చేశారట నిందితులు. ఆరోగ్యశాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్న సమయంలో ఆయన పేషీలో పనిచేశారట వంశీకృష్ణ. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.