న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాటపై..ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట బాధాకరమన్నారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ప్రధాని మోడీ. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ.

అటు న్యూఢిల్లీ తొక్కిసలాటపై స్పందించిన ఢిల్లీ మాజీ సీఎం అతిషి..మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తులకు ఇలా జరగడం చాలా బాధాకరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, యూపీ ప్రభుత్వం కానీ ప్రజల భద్రత గురించి పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఎలాంటి ఏర్పాట్లు లేవు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం ఎటువంటి కాంక్రీట్ రవాణా ఏర్పాట్లు లేవని ఫైర్ అయ్యారు. రైల్వే శాఖ ప్రజలకు వీలైనంత త్వరగా సహాయం అందించాలని కోరుతున్నానన్నారు అతిషి. కాగా… న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో ఏకంగా 18 మంది మరణించారు.