ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు కీలక పిలుపునిచ్చారు.సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభకు ప్లాన్ చేశారు.దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ నేతలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో ఆయన వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. ఏడాది పాలనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని గుర్తుచేశారు. రేపు(సోమవారం)ముగింపు ఉత్సవాల్లో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు,ప్రజలు భారీగా తరలిరావాలని సూచించారు.