తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను పొదల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు ఈ ముగ్గురు కామాంధులు. అయితే… దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… వెంటనే కేసు బుక్ చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Shocking News
సంగారెడ్డి, ఫసల్ వాదిలో 8 ఏళ్ల చిన్నారి పై ఇద్దరు యువకుల అత్యాచారం
ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు
చిన్నారికి తీవ్ర రక్తస్రావం అవడంతో ఆసుపత్రికి తరలించిన స్థానికులు
అత్యాచారం చేసిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో… pic.twitter.com/kivY7SyjaI
— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) February 21, 2025