తెలంగాణలో ప్రజా పరిపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్న విషయం విధితమే. ప్రజా పాలనకు ప్రభుత్వం రెండు రోజులు విరామం ఇచ్చింది. ఇవాళ, రేపు డిసెంబర్ 31 ఆదివారం సెలవు, సోమవారం జనవరి 01 నూతన సంవత్సరం కావడంతో ప్రభుత్వం అధికారికంగా రెండు రోజులు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ పరిపాలన కౌంటర్లలో ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేరు.
జనవరి 02వ తేదీ నుంచి యదావిధిగా కొనసాగుతాయని.. 06వ తేదీ వరకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దరఖాస్తుల ప్రక్రియ యథావిదిగా కొనసాగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. పనులు మానుకొని దరఖాస్తుల కోసం వచ్చి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరుతో గ్రామ, వార్డు సమావేశాలు నిర్వహించి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. జనవరి 06 వరకు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో ప్రభుత్వం రెండు సెలవులు ప్రకటించింది. దరఖాస్తులు తీసుకునేందుకు 8 రోజులగడువు మాత్రమే ఇచ్చారు.